ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 27: బాల్ కోసం బావిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శంకర్‌నాయక్ తండాలో చోటుచేసుకున్నది. శంకర్ నాయక్ తండాకు చెందిన ఆడే ఆర్యన్ (18) సోమవారం సాయంత్రం స్థానిక పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతున్నాడు.
ఈ క్రమంలో బాల్ సమీపంలోని వ్యవసాయ బావిలో పడింది. బాల్‌ను తీయడానికి వెళ్లిన ఆర్యన్ అందులో జారి పడ్డాడు. బావి పూడికలో కూరుకుపోయి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో బాధిత కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.