హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): ‘నా నియోజకవర్గంలో డబుల్ బె డ్రూం ఇండ్ల పనులు 90% పూర్తయ్యా యి. మిగిలినవి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించండి’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్య ఉ న్నదంటూ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వారం త ర్వాత సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావే శం నిర్వహించి సమస్య పరిష్కరించాలని చెప్పారు. కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టలేదని, కాగితాలకే పరిమితమయ్యాయని సీఎం, మంత్రులు చేసి న ఆరోపణలు నిరాధారమని స్పీకర్ వ్యా ఖ్యలతో రుజువయ్యాయని కామెంట్లు చే స్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పం దించారు. అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన విషయం బట్టబయలైందని ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్ వేదికలపై పెద్ద ఎత్తున పోస్టులు వెలిశాయి.