రాజోళి, సెప్టెంబర్ 28: ఇన్నాళ్లూ తోడూనీడై నిలిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా మృతిచెందిన ఘటన గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. రాజోళి మండలం పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి(70) కొంత కాలంగా గద్వాలలో హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే.. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఆయాసం రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని దవాఖానకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పచ్చర్లలో ఆయన అంతిమయాత్ర కొనసాగుతుండగా.. భర్త మృతిని తట్టుకోలేక లక్ష్మీదేవి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఏపీలోని కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది. భార్యాభర్తలు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.