సామాజిక న్యాయం కోసమే బీఆర్ఎస్
సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు అందరూ కదలాల్సిన అవసరముందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు.
- దేశమంతా తెలంగాణ మాడల్
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు అందరూ కదలాల్సిన అవసరముందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చే రాజకీయ వ్యవస్థ ఉండాలని, బీఆర్ఎస్తోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామాజిక పురోగతి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం నడుంకట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చేసి చూపించిన దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేద్దామని కేకే కోరారు. దేశంలో ఇప్పటివరకు ఉన్న పార్టీలు సామాజికన్యాయం విషయంలో విఫలమయ్యాయని, 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా పేద ప్రజల స్థితిగతుల్లో మార్పురాలేదని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా పనిచేసేవారికి మనవంతు చేయూతను అందిద్దామని అన్నారు. తెలంగాణాలో ఇప్పటికే అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశంలోని ప్రతీ ఒక్కరికి అందాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

