హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో పలుచోట్ల సిట్ బృందం విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో సిట్ అధికారులు పలువురిని విచారించారు.
కూచువారిపల్లెలో వైసీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్‌మెన్ ఈశ్వర్, గ్రామస్థులను విచారించారు. రామిరెడ్డిపల్లె సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని సిట్ అధికారులు పరిశీలించారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. సిట్ బృం దం నివేదికను ఈసీకి అందజేయనున్నది.