హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలుకు శుక్రవారం గడువు ముగియనున్నది. ఇప్పటివరకు 2,700 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు నమోదు చేశారు. ఈ నెల 8 వరకు 1,345 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఇందులో రెండు సార్లు నామినేషన్లు వేసిన వారు 157 మంది ఉన్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది.
మొత్తం మీద 8 వరకు 1,188 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వీటిలో 87 మంది అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించలేదని రిటర్నింగ్ అధికారులు (ఆర్వో) వెల్లడించారు. వీరితోపాటు అఫిడవిట్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.