తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.
శుక్రవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ లబ్ధిదారులకు ఇండ్ల తాళాలు అందజేయనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.