హన్వాడ, సెప్టెంబర్ 26 : మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లి గ్రామస్థులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతు పలికారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రకటించారు.
మంగళవారం అంబటోనిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు.