హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌పై నిరుద్యోగులు కదనభేరి మోగించారు. తమకు అన్యాయం చేసిన హస్తం పార్టీకి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి అశోక్‌నగర్‌లో సమావేశమైన నిరుద్యోగులు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయా రాష్ర్టాలకు వెళ్లి కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.