హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలం గాణ): జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన వి ధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకూ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెల పాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(టీజేఎఫ్టీ) రాష్ట్ర కమిటీ నిర్ణయిం చింది. ఉదయం 10:30 గంటలకు అన్ని జి ల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాల ని జిల్లా కమిటీలకు సూచించింది.
శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎఫ్టీ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాదిని ఉపేంద ర్, ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు రెండు రకాల కార్డుల విధానాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
వర్కింగ్ జర్నలిస్టులను విభజించేలా ఉన్న జీవో నంబర్ 252ను వెంటనే సవరించాలని కోరా రు. డెస్క్ జర్నలిస్టులకు ఎప్పటిలాగే అ క్రెడిటేషన్లు ఇవ్వాలని, అలాగే స్పోర్ట్స్, ఫీచర్స్, సినిమా, వెబ్, కల్చరల్, బిజినెస్ డెస్క్ జర్నలిస్టులతోపాటు కార్టూనిస్టులకు కూడా గతంలో మాదిరిగానే కార్డులు జారీ చే యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల పెద్దసంఖ్యలో పాల్గొనాలని పి లు పునిచ్చారు.