హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లి డీటీవో వెంకన్న అనుమానాస్పద మరణం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇసుక, బొగ్గు మాఫియాకు అడ్డొచ్చిన అధికారిని లారీలతో తొక్కి చంపేస్తారా? అని ప్రశ్నించారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలకు పాల్పడుతున్న వారి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతంకాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.