నల్గొండ : మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు చేరుకులేనంతగా గ్రామ, గ్రామాన, ఇంటింటా టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మునుగుడు ఖాయమని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ధీమాను వ్యక్తం చేశారు.
మునుగోడులో ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని శీర్ధపల్లి గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. సమస్త నారాయణపురం మండల కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ ముదిరాజ్ సంఘ సభ్యులతో సమావేశమై మాట్లాడారు.చౌటుప్పల్లోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ధోనిపాముల గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. నాంపల్లి మండలం గునగవల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇన్చార్జి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో తొమ్మిది పదవ వార్డులలో వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. వారి వెంట స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఎమ్మెల్యీ జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి తన స్వలాభం కోసం నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
సమస్త నారాయణపురం మండల కేంద్రంలో ఇన్చార్జి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 16, 20వ వార్డులలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వార్డు ఇన్చార్జి మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, హైదరాబాదుకు చెందిన కార్పొరేటర్లు ప్రచారం నిర్వహించారు.