హైదరాబాద్ : వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్.. నిన్న రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది.
నేడు అన్ని జిల్లాల్లో రైతు మహాధర్నాలను చేపట్టింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. కేంద్రంలోని మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
కేంద్రం వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని నినదించారు. ఈ ఆందోళనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..


మహబూబ్నగర్ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో..

జనగామ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..


కరీంనగర్ జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..

యాదాద్రిభువనగిరి జిల్లాలో..

జోగులంబ గద్వాల జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

ములుగు జిల్లాలో..

అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
