హైదరాబాద్ : నిర్మల్(Nirmal) జిల్లాలోని బాసర(Basara) ఆలయంలో బుధవారం రాత్రి చోరీ(Theft) జరిగింది. దుండగులు అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించారు. అమ్మవారి ఆలయంలోని ఉప ఆలయం అయిన దత్రాత్రేయ హుండీ(Dattatreya Hundi), ప్రసాద టికెట్ కౌంటర్‌ను పగుల గొట్టి నగదును అపహరించారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులను కఠినం శిక్షించాలని ఆలయ సిబ్బంది, భక్తులు డిమాండ్ చేశారు.
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ..
నిర్మల్ – బాసర అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించి.. ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేసిన దుండగుడు..
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.. విచారణ జరుపుతున్న పోలీసులు.. pic.twitter.com/aQdg9nPz3k
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2024