హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : దేశ వ్యాప్తంగా ఎంపీ సీట్లు పెంచితే భారం కాదు కానీ.. ఉద్యోగులకు పాత పింఛన్ అమలు మాత్రం భారంగా మారిందా..? అని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ సీపీఎస్ఈయూ) ప్రశ్నించింది.
సోమవారం హైదరాబాద్లో జరిగిన యూనియన్ అత్యవసర సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడారు.