హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖలో విలీనం చేయొద్దని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో-97లోని పాయింట్ 4ను తొలగించాలని కోరింది. ఆదివారం జేఏసీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ జనరల్ శ్రావణ్‌కుమార్ మాట్లాడతూ.. పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖలోకి విలీనం అయ్యేలా చేసిన విశ్రాంత అధికారి బీ వెంకటేశ్వర్లును తొలగించాలని డి మాండ్ చేశారు.
జీవో-97 ఉపసంహరణ, సాంకేతిక విద్యలో పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.