CM Revanth Reddy | తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్ అన్నారు.
‘మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలందించారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా సేవలందించారు. ప్రధానిగా పదేళ్లు అద్భుతమైన పాలన అందించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ ఆత్మబంధువు. తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిది. రాష్ట్రహోదా కల్పించిన మానవతావాది. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read..
KTR | గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయింది?: కేటీఆర్
Rythu Bharosa | యాసంగికైనా భరోసా అందేనా ?.. ప్రకటనలకే పరిమితమవుతున్న సర్కార్!
SPM | ఎన్నాళ్లీ నిరీక్షణ.. సిర్పూర్ పేపర్ మిల్లులో కానరాని గుర్తింపు సంఘం ఎన్నికలు