హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): దక్షిణ తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాప్రయోజలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు.
కృష్ణా నదీ పరిరక్షణ జేఏసీ, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.