హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు సోమవారంతో ముగిశాయి. 1,53,752 మంది అభ్యర్థులకు 1,15,028 (74.81%) అభ్యర్థులు పరీక్షలు రాయగా.. 38,724 మంది పరీక్షకు గైర్హాజరయ్యా రు. ఈ నెల 30న ప్రాథమిక కీని విడుదల చేస్తారు.
జూలై మొదటి లేదా రెండో వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.