టాస్క్‌ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ
ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు టాస్‌ఫోర్స్ కమిటీ 19వ సమావేశంలో ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు పెంపు అంశంపై చర్చ కొనసాగింది.
- తెలంగాణకు ఇబ్బంది ఉండబోదు: ఎన్‌డబ్ల్యూడీఏ
- రాష్ర్టాల అభ్యంతరంతో డీపీఆర్ డెడ్‌లైన్‌పై వెనకడుగు
హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు టాస్‌ఫోర్స్ కమిటీ 19వ సమావేశంలో ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు పెంపు అంశంపై చర్చ కొనసాగింది. మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తును పెంచి, అక్కడి నుంచే మేడిగడ్డ అవసరాలను తీర్చుకోవచ్చనే సరికొత్త ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ తెరమీదకు తీసుకొచ్చింది. ఈ అంశంపై టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఎత్తు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు కమిటీ సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే గోదావరి, కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి వాటాకు, సమ్మక-సారక ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొన్నట్టు సమాచారం. నదుల అనుసంధానం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని, దాదాపు 47 టీఎంసీల గోదావరి జలాలను వాడుకునే అవకాశం దక్కుతుందని టాస్క్‌ఫోర్స్ కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసినట్టు వినికిడి.
ప్రాజెక్టు ఆమోదానికి గడువేమీ లేదు
గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ ఆమోదానికి రాష్ట్రాలకు విధించిన గడువును ఎన్‌డబ్ల్యూడీఏ ఎత్తేసింది. ప్రాజెక్టు డీపీఆర్‌పై అభ్యంతరాలు, సూచనలను నెలాఖరులోగా తెలపాలని, లేదంటే ఆమోదించినట్టుగానే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ర్టాలకు ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏ ఆల్టిమేటం జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ డెడ్‌లైన్‌ను ఎత్తేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రభుత్వాలు ఏవిధమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేని సమయంలో ఇలాంటి షరతులు పెట్టడమేమిటని పలు రాష్ర్టాలు ఎన్‌డబ్ల్యూడీఏ తీరును తీవ్రంగా ఆక్షేపించాయి. దీంతో ఎన్‌డబ్ల్యూడీఏ నిర్దేశిత గడువును ఎత్తేసింది. ఈ మేరకు రాష్ర్టాలకు సమాచారం అందించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

