హైదరాబాద్, అక్టోబర్ (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. మంగళవారం జరిగిన విచారణకు సీనియర్ కౌన్సిల్ అందుబాటులో లేరని, విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ధర్మాసనం అంగీకరించింది. దీంతో విచారణను నేటికి వాయిదా వేసింది.
ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్‌రెడ్డి, ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ 2021 ఏప్రిల్ 13న సండ్ర వెంకటవీరయ్య సుప్రీంకోర్టులో వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లు మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వద్ద విచారణకు వచ్చాయి.