హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణం అమలు చేయాలని తెలంగాణ జేఏసీ వరింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ రాజమ్మ ద్ డిమాండ్ చేశారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఏ ఒక్కటి నెరవేరడం లేదని, వేతన భద్రత, ఉద్యోగ భద్రత లేదని, కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.