Revanth Reddy | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసు విచారణలో తరుచూ వాయిదాలు అడగటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోసారి వాయిదా అడగరాదని స్పష్టంచేసింది. కేసు విచారణను మరోసారి వాయిదా వేయాలని రేవంత్‌రెడ్డి తాజాగా సుప్రీంకోర్టును అశ్రయించాడు. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కొన్ని అనివార్య కారణాల రీత్యా విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు లేఖ రాశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. లేఖ పంపినట్టు తమకు ముందస్తు సమాచారం లేదని, అందువల్ల కేసు విచారణ వెంటనే చేపట్టాలని కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా విచారణ వాయిదా వేయొద్దని విన్నవించారు. దీనికి విముఖత చూపిన ధర్మాసనం విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో మరోసారి వాయిదా కొరవద్దని రేవంత్‌రెడ్డి న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టంగా చెప్పింది.