హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): బతుకమ్మకుంట వివాదంలో హైడ్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీశ్చంద్రశర్మలతోకూడిన ధర్మాసనం ఆదేశించింది. కంచె తొలగింపు సహా ఇతరత్రా విషయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఆ వివరాలను పొందుపరచాలని చెప్పింది.
స్టేటస్కో ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బతుకమ్మకుంటలో హైడ్రా అభివృద్ధి పనులు చేపట్టడంపై మండిపడిన హైకోర్టు.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ చేపట్టిన పనులన్నింటినీ తొలగించి పూర్వస్థితిని నెలకొల్పాలని గత నెల 17న ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న వాదనలు జరుగగా, విచారణ సోమవారానికి వాయిదా పడింది. తిరిగి సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బతుకమ్మకుంట విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది. తదుపరి విచారణను వచ్చేనెల 29కి వాయిదావేసింది.

బతుకమ్మకుంట స్థలం విషయంలో గత కొన్నినెలలుగా హైడ్రాకు, ఎడ్ల సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం కొనసాగుతున్నది. బాగ్అంబర్పేటలోని సర్వేనంబర్ 563/1లో ఉన్న ఏడెకరాల భూమి తనదేనని అందులో హైడ్రా పనులు చేపట్టడం సరైంది కాదంటూ సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సదరు వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ గత ఏడాది జూన్ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, వర్షాకాలంలో బతుకమ్మకుంటలోకి నీళ్లు వస్తే చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, వర్షపు నీరు మళ్లించడం కోసం అవసరమైన పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని హైడ్రా హైకోర్టును కోరింది. స్టేటస్కో ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు అక్కడ కేవలం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాలని ఆదేశించింది.
హైడ్రా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. ఆ స్థలంలో డ్రైనేజీ పనులతోపాటు పలు ఇతర అభివృద్ధి పనులను సైతం చేపట్టి పూర్తిచేసింది. పిల్లల ఆటస్థలం, వాకింగ్ ట్రాక్, ఓ గార్డెన్, బోర్లు వేయడం వంటి పనులు చేసింది. పనులు పూర్తయిన తరువాత ఆ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించింది. బతుకమ్మకుంట డెవలప్డ్ బై హైడ్రా అంటూ పెద్ద బోర్డు ఏర్పాటుచేసింది. దీనిపై హైడ్రా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పేర్కొంటూ సుధాకర్‌రెడ్డి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. హైడ్రా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము స్టేటస్కో ఉత్తర్వులు ఇచ్చేనాటికి బతుకమ్మకుంటలో భూమి స్వరూపం ఎలా ఉన్నదో తిరిగి అదే స్థితిని నెలకొల్పాలని మార్చి 17న ఆదేశించింది.
అక్కడ హైడ్రా నిర్మించిన సరిహద్దు గోడ, గ్రిల్స్, ఆటస్థలం, తదితరమైన అభివృద్ధి పనులన్నీ తొలగించాలని స్పష్టంచేసింది. ఇందుకోసం నెలరోజుల గడువునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్‌దత్త, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం ఈనెల 24న విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను పరిశీలించింది. పిటిషనర్ రంగనాథ్ తరఫున న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వులను పాటించడానికి పట్టే సమయం గురించి, సూచనలతో తిరిగి రావడానికి తమకు మూడురోజుల గడువు కావాలని కోరారు. దీంతో విచారణను 27న సోమవారానికి వాయిదా వేసింది. తిరిగి సోమవారం పిటిషనర్ తరఫున వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో బతుకమ్మకుంట చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సాధ్యమైనంత వరకు అమలు చేసి మిగిలిన వాటి విషయంలో ఉన్న ఇబ్బందులను గురించి నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇతర అంశాలపై తదుపరి విచారణలో స్పష్టత ఇస్తామని చెబుతూ విచారణను వచ్చేనెల 29కి వాయిదా వేసింది.
ఒకవైపు బతుకమ్మకుంట భూ వివాదం హైకోర్టులో కొనసాగుతుండగానే వ్యక్తిగత ప్ర తిష్ఠ కోసం పంతానికి పోయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజాధనాన్ని వృథా చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఆరు చెరువుల పునరుద్దర ణ అంటూ చేపట్టిన ప్రాజెక్టులో ఒక కాంగ్రెస్ నేత కోసం సీఎం చెప్పిన వెంటనే బతుకమ్మకుంటను కూడా చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఇ చ్చినా కేవలం తన ప్రాబల్యం కోసం రంగనాథ్ రూ.7.15కోట్ల ప్రజాధనాన్ని వినియోగించి వివాదాస్పద భూమిలో చేపట్టిన పను లు ప్రస్తుతం గాలిలో దీపంలా మారాయని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కోర్టు ఉ త్తర్వులను ధిక్కరించిన హైడ్రా అక్కడ ప్రజా ధనాన్ని వెచ్చించి కొత్త బోర్డులు, గ్రిల్స్ ఏ ర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టింది.
ఈ పనులను సీఎం రేవంత్‌రెడ్డితో అ ట్టహాసంగా ప్రారంభింపజేసి పెద్ద ఎత్తున ప బ్లిసిటీ చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నే పథ్యంలో తాజాగా బతుకమ్మకుంట వద్ద హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులు, శిలాఫలకా న్ని తొలగించారు. ఇవి ఎవరు తీశారంటూ అక్కడ ఉన్న గార్డును అడిగితే గాలికి పడిపోయాయని చెప్పడం గమనార్హం. కోర్టులో వి వాదం ముగియకముందే పెద్ద ఎత్తున ప్రచా రం చేసుకుంటూ ఒక అధికారి రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తూ తన ఫొటోలతో చేసిన హంగామాపై అప్పట్లోనే దుమారం రేగింది. తాజా పరిణామాలతో ప్రభుత్వ ఉ ద్యోగి అయి ఉండి ప్రజాధనంపై కచ్చితత్వం లేకపోవడమేమిటని మండిపడుతున్నారు.