సిరికొండ, అక్టోబర్ 9: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు గ్రామాల్లో రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు తీర్మానాలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్‌కు చెందిన మున్నూరుకాపు సంఘ సభ్యులు సోమవారం గ్రామంలో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని బాజరెడ్డికి అందజేశారు.