Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కారు తర్జనభర్జన పడుతున్నది. అటు కులగణనపై గందరగోళం నెలకొన్నది. ఇటు డెడికేషన్ కమిషన్ సిఫారసులపై అయోమయం కనిపిస్తున్నది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వా తే ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించింది. మరోవైపు ఇంటర్, టెన్త్ పరీక్షలు తరుముకొస్తుండటంతో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై పీటముడి పడింది.
డెడికేషన్ కమిషన్ 2011 జనాభా లెక్కలు, కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ మార్గదర్శకాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. ఆరు విభాగాలుగా విభజించి నివేదించింది. వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ ఇలా ఆయా స్థానాల్లో బీసీల జనాభాను పరిగణలోకి తీసుకొని వారికి కేటాయించాల్సిన రిజర్వేషన్లపై స్పష్టమైన సూచనలు చేసింది.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు క ల్పించాల్సి ఉన్నది. కులగణన ప్రకారం ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం కలిసి సుమారు 28 శా తం కేటాయించాల్సి ఉంటుంది. ఏజె న్సీ ప్రాంతాల్లోని పంచాయతీలను పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి వస్తుంది. ఇక మిగిలిన స్థానాల్లో బీసీలకు రిజర్వ్ చేసే వీలుంటుంది.
ఈ ప్రకారం 56.33 శాతం ఉన్న బీసీలకు కేవలం 22 శాతం కోటా మాత్రమే దక్కనున్నది. దీంతో కమిషన్ సిఫారసులపై పూర్తిగా అధ్యయనం తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. బీసీలకు ఇవ్వాల్సిన 22శాతం కోటాను జనరల్‌గా పరిగణించి పార్టీపరంగా 42శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది. 42 శాతం కోటా ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నా రు. అయితే ఇందుకు కనీసం 21 రో జుల గడువు కావాల్సి వస్తుందని పే ర్కొంటున్నారు. మార్చి 5 నుంచి ఇం టర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలంటే ఫిబ్రవరి 20లోపే నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. కానీ పరిస్థితులు అందు కు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్లో బుధవా రం సమావేశం నిర్వహించనున్నారు. డెడికేషన్ కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నట్టు తెలిసింది. ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.