హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్‌రెడ్డిని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. డిప్యూటేషన్‌పై టీఎస్పీఎస్సీకి వచ్చిన జగదీశ్వర్‌రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్‌ను నియమించింది. విధుల్లో ఎటువంటి మచ్చలేని, నిబద్ధత కలిగిన అధికారులను గుర్తించి బాధ్యతలు అప్పగిస్తున్నది.
భవిష్యత్తులో పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. సైబర్ సెక్యూరిటీకి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఐటీ ప్రొఫెషనల్స్‌తో శాశ్వత పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నది. వాటిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి నుంచి జూనియర్ ప్రోగ్రామర్ వరకూ ఆరు పోస్టులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు ముగ్గురు ప్రత్యేక అధికారులు ఉంటారు. ఇవన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.