Telangana Debts | అప్పులపై కుప్పిగంతులు!.. కాంగ్రెస్ నేతల తలోమాట
Telangana Debts | తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెకలు వల్లె వేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ గణాంకాలపై సీఎం, మంత్రుల మధ్య తీవ్రమైన గందరగోళం నెలకొన్నది.
Telangana Debts | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెక్కలకు వల్లె వేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ గణాంకాలపై సీఎం, మంత్రుల మధ్య తీవ్రమైన గందరగోళం నెలకొన్నది. గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం లెక్కలకు, ప్రస్తుతం మంత్రులు చెప్తున్న గణాంకాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మీడియా సమావేశంలో పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్నిరకాల అప్పులు రూ.8.21 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించిన గణాంకాలకు, భట్టి లెక్కలు భిన్నంగా ఉండటం గమనార్హం.
భట్టి విక్రమార్క వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన మొత్తం అప్పుల్లో రూ.40,154 కోట్ల పెండింగ్ బిల్లులు (ఉద్యోగుల బకాయిలు, మూలధన పనులు, సంక్షేమ పథకాల బిల్లులు తదితరాలు), మరో రూ.1.09 లక్షల కోట్ల మేర విద్యుత్తు పంపిణీ సంస్థల (డిసమ్లు) ఇంధన బకాయిలు, సింగరేణి విద్యుత్తు బకాయిల వంటి చెల్లింపులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 2023లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో తెలంగాణ మొత్తం అప్పులు రూ.6.71 లక్షల కోట్లు (బీఆర్ఎస్ దిగిపోయే నాటికి) అని కాంగ్రెస్ ప్రభుత్వం పేరొన్నది. కానీ, తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ అంకెను రూ. 8.21 లక్షల కోట్లకు పెంచేశారు.
విచిత్రం ఏందంటే? ఆ అప్పులపై క్యాబినెట్ మంత్రులలో ఎవరికీ స్పష్టత లేనట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ రాష్ట్ర అప్పు రూ.8.11 లక్షల కోట్లు అని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గత ప్రభుత్వం చేసిన అప్పు రూ.7.30 లక్షల కోట్లు అనగా, మళ్లీ శుక్రవారం నాటికి దానిని రూ.8.21 లక్షల కోట్లుగా మార్చేశారు. కరీంనగర్లో శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ మొత్తం ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిందని సెలవిచ్చారు.
కాంగ్రెస్ అప్పులపై తేలిన నిజాలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.14 లక్షల కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, తాము కేవలం రూ.1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని భట్టి విక్రమార సమర్థించుకొన్నారు. దీనిలో ట్విస్ట్ ఏందంటే? ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28, వరకు (27 నెలల్లో) కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్టు అంగీకరించారు.
అంతేగాకుండా, ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2026 నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలోనే ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు చేసిన మొత్తం అప్పులు రూ.3.19 లక్షల కోట్లుగా స్పష్టంగా నమోదయ్యాయి. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలోనే గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి అసలు, వడ్డీలు కలిపి ఏకంగా రూ.2,08,681 కోట్లు తిరిగి చెల్లించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పుకొచ్చారు. వీటిల్లో అప్పులపై ఏ సంఖ్య నిజమని ప్రజలు, ఆర్థిక నిపుణులు గందరగోళానికి గురవుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుపై భిన్నాభిప్రాయాలు ఇలా..
- తెలంగాణ మొత్తం అప్పు రూ.8.11 లక్షల కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి
- బీఆర్ఎస్ సర్కార్ చేసిన అన్నిరకాల అప్పులు రూ.8,21,651 కోట్లు: ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క
- బుధవారం రూ.7.30 లక్షల కోట్లు, శుక్రవారం నాడు రూ.8.21 లక్షల కోట్లు:మంత్రి జూపల్లి కృష్ణారావు
- బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు రూ.7.50 లక్షల కోట్లు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- రుణాలు, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి చెల్లిస్తున్న రుణాలన్ని కలిపినా రూ.4.17 లక్షల కోట్లు: మాజీ మంత్రి హరీశ్‌రావు
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలు ఇలా..
- రూ.4.14 లక్షల కోట్లు: బీఆర్ఎస్ (హరీశ్‌రావు)
- రూ. 3.47 లక్షల కోట్లు: ముఖ్యమంత్రి (రేవంత్‌రెడ్డి)
- రూ.1.77 లక్షల కోట్లు :ఆర్థికమంత్రి (భట్టి విక్రమార్క)
- రూ.3.19 లక్షల కోట్లు: సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2026 నివేదిక
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

