Kodangal | బొంరాస్‌పేట, సెప్టెంబర్ 10: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బొంరాస్‌పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతోపాటు ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్టీ వంటి వృతి విద్యా కోర్సులను అనుమతించారు. దీంతో ఆయా కోర్సు ల్లో 30 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందా రు. తీరా ప్రభుత్వం ఒక్క అధ్యాపకుడిని కూడా నియమించకపోవడంతో ఇప్పటికే పది మంది విద్యార్థులు టీసీలు తీసుకొని ఇతర కాలేజీలకు వెళ్లిపోయారు. మిగతా పేద విద్యార్థులు లెక్చరర్ల రాకకోసం ఎదురు చూస్తున్నా రు. ఇప్పటికే ఇతర కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కాగా ఈ కాలేజీలో చేరిన విద్యార్థులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కాలేజీలో అధ్యాపకులను నియమించి ఉంటే విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో చేరేవారని, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా స్పందించి బొంరాస్‌పేట జూనియర్ కళాశాలలో లెక్చరర్లను నియమించి తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్థానికంగానే కళాశాల రావడంతో ఊర్లోనే ఉండి చదువుకోవచ్చన్న ఉద్దేశంతో సీఈసీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఇప్పటివరకు లెక్చరర్లను నియమించలేదు. ప్రభుత్వం లెక్చరర్లను నియమించి తరగతులను ప్రారంభించాలి. అధ్యాపకులు ఉంటే ఇంకా చాలా మంది విద్యార్థులు జాయిన్ అవుతారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల విడుదలకు ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించనున్నది. ఇందుకు రెండు రోజులపాటు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. డీఎస్సీ ఫైనల్ ‘కీ’ని ఇప్పటికే విడుదల చేశారు. ఫైనల్ ‘కీ’పైనా అభ్యర్థులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఆయా అభ్యంతరాలను రివ్యూ కమిటీ పరిశీలనకు పంపించారు. కమిటీ పరిశీలన పూర్తైన తర్వాత రివైజ్డ్ ఫైనల్ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేయనుంది. ఆ తర్వాత టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను విడుదల చేస్తారు. దీంట్లో భాగంగానే టెట్ మార్కులను మరోసారి అప్లోడ్ చేసుకునే అవకాశమివ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఒకటీ రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది.