హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని పీఆర్సీకి ఎస్జీటీ ఫోరం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో రెండో వేతన సవరణ సం ఘం ఆహ్వానం మేరకు గురువారం బీఆర్కే భవన్లో నిర్వహించిన సమావేశానికి ఎస్జీటీ ఫోరం సభ్యులు హాజరయ్యారు.
ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వేతన వ్యత్యాసం, బేసిక్ పే చెల్లింపు, సీపీఎస్ రద్దు , 51 శాతం ఫిట్మెంట్ తదితర అంశాలపై పీఆర్సీకి విజ్ఞప్తి చేశామని ఫోరం సభ్యులు తెలిపారు.