హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): బీజేపీకి మద్దతుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్ష చేశారు.
ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజినీకాంత్, ప్రధాన కార్యదర్శి టీ నాగరాజు ఖండించారు. దీనిని ప్రజాస్వామ్య హకులపై దాడిగా పేర్కొన్నారు.