హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ 37వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో ఈ సంస్థ స్వచ్ఛమైన విద్యుత్తును అందిస్తున్నదని ప్రశంసించారు.
హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను విజయవంతంగా ప్రజలకు చేరవేస్తున్న ఘనత ఈ సంస్థదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్ బాలకృష్ణారావు, సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.