ఆదివారం 31 మే 2020
Telangana - May 14, 2020 , 15:59:33

అంగన్ వాడీల సేవలు ప్రశంసనీయం

అంగన్ వాడీల సేవలు ప్రశంసనీయం

హైదరాబాద్  : కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీ సేవలు, సరుకులు లబ్ధిదారులకు చేరుతున్న తీరు, అంగన్ వాడీ లు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలపై  స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి త్యవతి రాథోడ్ టి.సాట్ ప్రభుత్వ ఛానల్ ద్వారా ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీ  కేంద్రాలు మూసి వేయొద్దని ముందు అనుకున్నా తప్పని పరిస్థితుల్లో మూసేసి ఇంటింటికి సరఫరా చేయాలని నిర్ణయింమన్నారు. అంగన్ వాడీ సేవలు, సరుకులు పొందడంలో ఏ ఒక్కరూ మిస్ కావొద్దని సీఎం కేసీఆర్  చెప్పారని, దీనిని  వందశాతం పాటించాలన్నారు. బాలింతలు, గర్భిణులు, పిల్లలకి ఎక్కువ సమస్యలు ఉంటాయి, కావున మనం వారిపట్ల మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీల సేవలను మంత్రి ప్రశంసించారు.


logo