హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 27వ చైర్మన్‌గా జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకవడంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ గురువా రం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శ్రీనివాసులుశెట్టి మారుమూల గ్రామంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి, ఎస్బీఐ చైర్మన్ స్థాయికి ఎదగడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఎస్బీఐ చైర్మన్‌గా తెలుగువాళ్లు తొలిసారిగా నియామకమవడం తెలంగాణకు గర్వకారణమని పేరొన్నారు. శ్రీనివాసులు శెట్టిని తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార సన్మానించాలని కోరారు.
వైరారూరల్, ఆగస్టు 8: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తు న్న కారు టైరు గురువారం పంక్చర్ అయింది. డ్రైవర్ అప్రమత్తమై పక్కకు నిలిపారు. గురువారం ఖమ్మంలోని తన నివాసం నుంచి మంత్రి పొంగులేటి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి కాన్వాయ్‌తో బయలుదేరారు. వైరాలోని హైలెవల్ వంతెన దిగిన తర్వాత జాతీయ రహదారిపై మంత్రి ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ వెనుక టైర్ పంక్చరైంది. అప్రమత్తమైన డ్రైవర్ కారును వెంటనే పక్కకు నిలిపారు. ఆ తర్వాత పొంగులేటి స్పేర్ వెహికిల్‌లో ప్రగడవరం వెళ్లిపోయారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తాడోబా అభయారణ్యా ల నుంచి 25 రోజుల క్రితం కాగజ్ అటవీ ప్రాంతానికి వచ్చిన ఎస్-12 పులి జనావాసాలకు దగ్గరగా సం చరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడున్నర ఏళ్ల వయసున్న మగపులి కదలికలు తాజా గా తిర్యాణి మండలం ఎదులపహాడ్ అడవుల సమీపంలో కనిపించాయి.