అడవుల పునరుద్ధరణలో మారుత్ జోరు
దేశంలో అడవుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ జోరుగా ముందుకు సాగుతున్నది.
- డ్రోన్ల సాయంతో విత్తన బంతుల పంపిణీ
- 1,400 జిల్లాల్లో రెండో విడత కార్యక్రమం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలో అడవుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ జోరుగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా సీడ్ కాప్టర్ల (డ్రోన్ల) ద్వారా అడవుల్లో విత్తన బంతుల (సీడ్ బాల్స్)ను చల్లే రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే తెలంగాణ సహా 7 రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో ‘హరాభరా’ పేరుతో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని, దీన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఇతర రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను చల్లేందుకు అనుమతిచ్చిందని మారుత్ డ్రోన్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రేమ్ వివరించారు.
అంతరించిపోతున్న అటవీ సంపదను పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, వివిధ కార్పొరేట్ కంపెనీలతో కలిసి దేశవ్యాప్తంగా 1,400 జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సీడ్ కాప్టర్ల ద్వారా విత్తన బంతులను చల్లనున్నామని తెలిపారు. సీడ్ బాల్స్ తయారీ బాధ్యతలను సహాయ సహాయక సంఘాలకు అప్పగించామని, తద్వారా వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

