Home
Telangana
The Second Anniversary Of The Zero Gst Movement On Handloom Will Be Organized On 5th Of This Month At Padmasali Bhavan Narayanguda
ద్వితీయ వార్షికోత్సవం
చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
- 5న చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 శాతం జీఎస్టీ పన్నును పరిహారంగా చెల్లిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అధ్యక్షతన కొనసాగే ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పద్మశాలి ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం నేతలు పాల్గొనాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

