హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యాక్షన్‌ప్లాన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అత్యుత్తమ ఫలితాల సాధనకు కసరత్తును ప్రారంభించింది. ఈ మేరకు 2026 జనవరి 10లోపు సిలబస్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది.
అక్టోబర్ నుంచే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకోవాలని ఆదేశించింది. మూడురోజుల్లో ఒకరోజు పాఠాల బోధన.. మరుసటి రోజు పరీక్ష.. ఆ తర్వాత పరీక్షపై ఫలితాల విశ్లేషణ ఇలా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలని పలు సూచనలు చేసింది.