ఉరకలెత్తుతున్న కాళేశ్వరం జలాలు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు మళ్లీ మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోస్తుండగా, సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి తరలివెళ్తున్నాయి. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో ని నంది పంప్‌హౌస్‌లో 2,7వ మోటర్లను ఆదివారం ఉదయం 9 నుంచి సాయం త్రం 4 వరకు నడిపించారు.
- లింక్-2లో నంది, గాయత్రీ పంప్‌హౌస్ మోటర్ల జలగర్జన
- ఎల్లంపల్లి బరాజ్ నుంచి మధ్యమానేరుకు పంపింగ్
- అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్‌కు తరలివస్తున్న జలాలు
ధర్మారం/రామడుగు, ఏప్రిల్ 5 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు మళ్లీ మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోస్తుండగా, సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి తరలివెళ్తున్నాయి. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో ని నంది పంప్‌హౌస్‌లో 2,7వ మోటర్లను ఆదివారం ఉదయం 9 నుంచి సాయం త్రం 4 వరకు నడిపించారు. ఒకో మోటర్ ద్వారా 3,150 క్యూసెకులు డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగసిపడుతూ నంది రిజర్వాయర్ మీదుగా కరీంనగర్ జిల్లా రామడుగు మం డలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరాయి. అకడ 2, 4వ నంబర్లు గల రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేశారు. డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసిపడ్డ జలాలను గ్రావిటీ కెనాల్ ఎస్సారెస్పీ వరద కాలువలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 0.14 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్టు అధికారులు పేర్కొన్నారు.
రంగనాయక సాగర్‌లోకి పంపింగ్ షురూ
చిన్నకోడూర్/ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 5: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషి ఫలించింది. యాసంగి సాగు పూర్తయ్యే వరకు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాలని హరీశ్‌రావు అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి లేఖ అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో తమ పంటలు గట్టెక్కుతాయని రైతులు సంతోషం వ్యక్తంచేస్తూ హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కెనాల్ ద్వారా 9,900 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు ఏఈ వంశీ పేర్కొన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.50 టీఎంలకుగాను ప్రస్తుతం 2.47 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

