హైదరాబాద్, నవంబర్ 23 (నమ స్తే తెలంగాణ): రవాణాశాఖ అధికారులు ఈ ఏడు నిర్దేశించుకున్న ఆదా య లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో శనివారం స్పెష ల్ సెక్రటరీ వికాస్రాజ్తో కలిసి రవాణాశాఖ, ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రవాణాశాఖలో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను క్లియర్ చేయాలని నిర్దేశించారు. 15 ఏండ్ల కాలపరిమితి దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలని, రాష్ట్రంలోని 62 రవాణాశాఖ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. యూనిసెఫ్ సహకారంతో ప్రతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 20 వరకు ఆర్టీసీ రూ. 111 కోట్ల జీరో టికెట్లను జారీ చేసిందని చెప్పారు. దీంతో రూ. 3747 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని తెలిపారు. 1389 కొత్త బస్సులు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో రవాణాశాఖ కమిషనర్ సురేంద్రమోహన్, జేటీసీలు రమేశ్, మమత పాల్గొన్నారు.