హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని పీఆర్సీ కమిటీకి రెవెన్యూ ఉద్యోగ సం ఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శివ శంకర్ నేతృత్వంలోని వేతన సవరణ కమిటీతో.. గురు వారం ట్రెసా, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ విజ్ఞప్తులకు కమిటీ సానుకూలంగా స్పందించిందని నేతలు తెలిపారు.
సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, నిరంజన్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్పాల్గొన్నారు.