బెల్లంపల్లి, జూన్ 2: రేవంత్ సర్కార్ పాలనలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతున్నది. కనీసం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సైతం జరుపకుండా అడ్డుతగులుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గంగారాంనగర్లో మంగళవారం స్థానిక బస్తీవాసులతో కలిసి స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ డీ రాజ్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ అక్కడకు చేరుకొని ఇది జాతీయజెండా కాదని, కాంగ్రెస్ జెండా పోలీసుల ముందే అడ్డుకున్నాడు. దీంతో ఉద్రిక్తత నెలకొన్నది. బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, టూటౌన్, తాళ్లగురిజాల ఎస్ఐలు కిరణ్‌కుమార్, రామకృష్ణ చేరుకొని జెండాను తొలగించారు. విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివరాలు తెలుసుకున్నారు.