రిటైర్డ్ టీచర్‌ది ముమ్మాటికీ సర్కార్ హత్యే.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్
ప్రభుత్వం నుంచి బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని.. విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
- జనగామలో మల్లయ్య కుటుంబానికి పరామర్శ
జనగామ, జూలై 10 (నమస్తే తెలంగాణ: ప్రభుత్వం నుంచి బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని.. విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని శుక్రవారం పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.
ఉపాధ్యాయుడిగా దాదాపు 35 ఏండ్లు సేవలందించిన మల్లయ్యకు ఉద్యోగ విరమణ అనంతరం పీఎఫ్, జీపీఎఫ్, గ్రాట్యుటీతోపాటు ఇతర రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించక పో వడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. బకాయిల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టును ఆశ్రయించినా న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడటం మానేసి, కాంట్రాక్టర్లకు చెల్లించే నిధులను ఒకరోజు నిలిపివేసినా విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ చెల్లించవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

