అందోల్, జూలై 10: ఫోర్జరీ సంతకాలతో భూమికి సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్లను సృష్టించి ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు పెట్టేందుకు యత్నించారు ముగ్గురు కేటుగాళ్లు. బుధవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సీఐ అనిల్‌కుమార్ వివరా లు వెల్లడించారు. అందోల్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి (సైబరాబాద్ మాజీ సీపీ) శేరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఈ భూమిని కొనుగోలు చేసినట్టు నారాయణఖేడ్ నియోజకవర్గం ర్యాకల్‌కు చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడికి చెందిన సుధాకర్, ముకుందానాయక్ తండాకు చెంది న రవీందర్ నకిలీ అగ్రిమెంట్ డాక్యుమెంట్లు సృష్టించారు. ప్ర భాకర్‌రెడ్డి, కుటుంబసభ్యుల సంతకాలు ఫో ర్జరీ చేసి, హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ యా దగిరిరెడ్డికి విక్రయ ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.11 లక్షలు తీసుకున్నారు.
భూమి రిజిస్ట్రేషన్ కోసం సంజీవరెడ్డికి యాదగిరిరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన యాదగిరిరెడ్డి నేరుగా అందోల్‌కు వచ్చి ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులను సంప్రదించగా.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసం చేసినట్టు తేలింది. ఈ విషయం ప్రభాకర్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన జోగిపేట సీఐ.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.