హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ): దేశంలో యువ రాష్ట్రమైన తెలంగాణ ప్రజాసంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, పెట్టుబడుల సాధన తదితర అనేక రంగాల్లో దేశానికే దారి చూపుతున్నదని ఇప్పటికే అనేక అధ్యయనాలు ప్రకటించాయి. తాజాగా ఆర్థిక క్రమశిక్షణ, నిర్వహణలో అద్భుత పనితీరు కనబరుస్తున్నదని భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రశంసించింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణలో అనేక పెద్ద రాష్ట్రాలను తలదన్నే స్థాయిలో నిలిచిందని ఆర్బీఐ విడుదలచేసిన అధ్యయన పత్రంలో కితాబిచ్చింది. 2022-23 వార్షిక బడ్జెట్‌కు ముందు ఈ అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వానికి మరింత శక్తినిచ్చే అంశమని ఆర్థికవేత్తలు అంటున్నారు. అప్పులు చేయటంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు పోటీ పడుతుండగా, తెలంగాణలో అనేక ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అప్పులు అదుపులోనే ఉన్నాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.
ఆర్బీఐ నివేదికలోని కీలకాంశాలు..
రాష్ట్రం అప్పుల పాలైందన్న ప్రతిపక్షాల విమర్శలను ఆర్బీఐ నివేదిక పటాపంచలు చేసింది. రుణాలు పొందడంలో అనేక పెద్ద రాష్ర్టాల తర్వాతనే తెలంగాణ 9వ స్థానంలో ఉన్నది.
ఆర్థిక నిర్వహణలో దేశంలో ఇప్పటివరకు గుజరాత్, కర్ణాటక ముందు వరుసలో ఉండేవి. ఇప్పుడు ఆ జాబితాలోకి తెలంగాణ వచ్చి చేరింది.
తెలంగాణ రుణ-స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి (జీఎస్డీపీ) దేశంలోనే అత్యల్పంగా నమోదు అయినట్టు నివేదిక పేర్కొన్నది.
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 మధ్య కాలంలో వార్షిక డాటా ఆధారంగా రూపొందించిన అధ్యయనం, రాష్ట్ర పనితీరు సూచిక (ఎస్పీసీఐ) తెలంగాణ ఆర్థిక పనితీరుతోపాటు మార్కెట్ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని విశ్లేషించింది.
2014-15 నుంచి 2018-19 వరకు తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) సగటు అప్పు 16.1 శాతం. ఇది ఇతర రాష్ట్ట్రాలతో పోలిస్తే అత్యల్పం. ఈ రుణ నిష్పత్తి గరిష్ఠంగా జమ్ము కశ్మీర్లో 48.7శాతం ఉన్నది.
తక్కువ రుణ నిష్పత్తి రాష్ర్టాల ఆర్థిక పరిపుష్టికి అద్దం పడుతుంది.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగిందని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. రాష్ర్టాలు సాధారణంగా పదేండ్ల మెచ్యూరిటీతో బాండ్లను విడుదల చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం 2015-16 నుంచి 30 ఏండ్ల కాలపరిమితితో మెచ్యూరిటీ సెక్యూరిటీలను జారీ చేయగలగడం గొప్ప విషయమని పేర్కొన్నది.
రెవెన్యూ రాబడిలో తెలంగాణ సొంత ఆదా య ఉత్పత్తికి సంబంధించి దేశీయ ర్యాంకుల్లో అద్భుతంగా మెరుగుపడింది. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 11వ ర్యాంకు ఉండగా ప్రస్తుతం ఆరో ర్యాంకు కు చేరుకొన్నది.
ఇదే కాలంలో ఓపెన్ మార్కెట్ నుంచి అత్యధిక రుణాలు తీసుకొన్న రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తొలి 8 స్థానాల్లో ఉన్నాయి.
పెట్టుబడిదారులు ఆర్బీఐ అధ్యయన సూచికలనే ప్రామాణికంగా తీసుకొంటారు. దీంతో ఈ నివేదిక తెలంగాణ ప్రగతికి మరింత దోహదం చేయనున్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ సత్తా తేల్చిన ఆర్బీఐ నివేదిక: కేటీఆర్
తెలంగాణ ఆర్థిక నిర్వహణను ఆర్బీఐ ప్రశంసించటంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ‘అప్పులు తక్కువ.. అప్పుల మీద వడ్డీ తక్కువ. వడ్డీల చెల్లింపు కోసం చేసే ఖర్చు తక్కువ. బడ్జెట్లో క్యాపిటల్ వ్యయం ఎక్కువ. ఆదాయంలో సొంత పన్నుల రాబడి ఎక్కువ. ఆర్థిక పరిఫుష్టిని ప్రతిబింబించే ప్రతి సూచీలో టాప్ 1 నుంచి 5 స్థానాల్లోనే. తెలంగాణ సత్తా తేల్చిన ఆర్బీఐ నివేదిక’అని ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వం తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న పురోగతి, అభివృద్ధికి నిదర్శనం. సగటు రుణ-స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తిలో 2014 నుంచి 2019 వరకు దేశంలోనే అద్భుతమైన పనితీరు కనబరిచిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత
తక్కువ రుణ నిష్పత్తి రాష్ర్టాల ఆర్థిక పరిపుష్టికి అద్దం పడుతుంది.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగిందని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. రాష్ర్టాలు సాధారణంగా పదేండ్ల మెచ్యూరిటీతో బాండ్లను విడుదల చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం 2015-16 నుంచి 30 ఏండ్ల కాలపరిమితితో మెచ్యూరిటీ సెక్యూరిటీలను జారీ చేయగలగడం గొప్ప విషయమని పేర్కొన్నది.
రెవెన్యూ రాబడిలో తెలంగాణ సొంత ఆదా య ఉత్పత్తికి సంబంధించి దేశీయ ర్యాంకుల్లో అద్భుతంగా మెరుగుపడింది. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 11వ ర్యాంకు ఉండగా ప్రస్తుతం ఆరో ర్యాంకు కు చేరుకొన్నది.
ఇదే కాలంలో ఓపెన్ మార్కెట్ నుంచి అత్యధిక రుణాలు తీసుకొన్న రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తొలి 8 స్థానాల్లో ఉన్నాయి.
పెట్టుబడిదారులు ఆర్బీఐ అధ్యయన సూచికలనే ప్రామాణికంగా తీసుకొంటారు. దీంతో ఈ నివేదిక తెలంగాణ ప్రగతికి మరింత దోహదం చేయనున్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ సత్తా తేల్చిన ఆర్బీఐ నివేదిక: కేటీఆర్
తెలంగాణ ఆర్థిక నిర్వహణను ఆర్బీఐ ప్రశంసించటంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ‘అప్పులు తక్కువ.. అప్పుల మీద వడ్డీ తక్కువ. వడ్డీల చెల్లింపు కోసం చేసే ఖర్చు తక్కువ. బడ్జెట్లో క్యాపిటల్ వ్యయం ఎక్కువ. ఆదాయంలో సొంత పన్నుల రాబడి ఎక్కువ. ఆర్థిక పరిఫుష్టిని ప్రతిబింబించే ప్రతి సూచీలో టాప్ 1 నుంచి 5 స్థానాల్లోనే. తెలంగాణ సత్తా తేల్చిన ఆర్బీఐ నివేదిక’ అని ట్వీట్ చేశారు.