హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా అభద్రతాభావంతో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సీఎం కేసీఆర్ సంతకంతో వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లా మారారు. ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల్లా పూర్తి భరోసాతో, భద్రతతో తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించనున్నారు. ఇంటర్ విద్య, కళాశాల విద్య, సాంకేతిక విద్యలోని 3,897 అధ్యాపకులు, ఉద్యోగులను ప్రభు త్వం క్రమబద్ధీకరించింది.
లెక్చరర్ల జాబితాలతో కూడిన జీవోలను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేశారు. సబ్జెక్టులవారీగా క్రమబద్ధీకరించిన అధ్యాపకుల జాబితాలను ప్రకటించారు. మొత్తంగా 13 జీవోలను ఒకే రోజు విడుదల చేశారు. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ ఫైల్‌పై సం తకం చేయగా, ఆర్థికశాఖ జీవోను జారీచేసిం ది.కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థ రాష్ట్రంలో రద్దుకాగా, ఇక నుంచి శాశ్వత నియామకాలే ఉండనున్నాయి. మాట నిలబెట్టుకున్న సీఎంకు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.