కృష్ణ కాలనీ, నవంబర్ 1: సింగరేణిలో ఇటీవల గెలుపొందిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సం ఘం ఐఎన్టీయూసీలు కార్మికుల సమస్యలను పకనపెట్టి తమ స్వలాభాల కోసమే పనిచేస్తున్నాయని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్, కో కన్వీనర్ ఐ కృష్ణ, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులు అనేక సమస్యలు ఎదురొంటున్నారని, సింగరేణి ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. మందమర్రి, భూపాలపల్లితోపాటు మరికొన్ని ఏరియాల్లో గుడి కమిటీ అకౌంట్‌పై యూనియన్ చందా (కార్మికుల సభ్యత్వం) రికవరీ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.