యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా సాగాయి. ఉదయం, సాయంత్రం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ, స్వర్ణరథాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాలతో పాటు ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు.
స్వామివారి ధర్మ దర్శానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. స్వామివారిని 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఖజానాకు రూ. 53,22,872 ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డీఈవో దోర్భాల భాస్కర్శర్మ, ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.