హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ సజావుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 81,069 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అందులో 45,865 దరఖాస్తులకు డీఈవోలు అమోదం తెలిపారు.
563 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 34,641 దరఖాస్తులు డీఈవోల పరిశీలనలో ఉన్నాయి. శుక్రవారం సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ శనివారం కూడా కొనసాగనున్నది.