ప్రముఖులకు సర్ నోటీసులు
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు వివరణ నోటీసులు జారీచేశారు.
- సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు వీఐపీల వివరాల్లో వ్యత్యాసాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు వివరణ నోటీసులు జారీచేశారు. ఇటీవల ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించిన అధికారులు కొన్ని నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్ల వివరాల్లో సాంకేతిక లోపా లు, పాత రికార్డులతో ప్రస్తుత వివరాలు సరిపోకపోవడం, సమర్పించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వీఐపీ ఓటర్లకు నిబంధనల ప్రకా రం నోటీసులు పంపించారు. సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటుడు మహేశ్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోదర్, సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా నోటీసుల జాబితాలో ఉన్నట్టు తెలిసింది.
ప్రముఖ నటి సమంత, యువనటుడు విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పేరుపైనా నోటీసు జారీ అయినట్టు తెలుస్తున్నది. కాగా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులకు నోటీసులు అందినట్టు సమాచారం. ప్రముఖ ఐటీ దిగ్గ జం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కుటుంబసభ్యుల ఓటరు వివరాలపైనా అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
నోటీసు అందినంత మాత్రాన సం బంధిత వ్యక్తి ఓటు హకు రద్దయినట్టు కాద ని, ఇది కేవలం ఓటరు వివరాల ధ్రువీకరణ ప్రక్రియలో భాగమని సీఈవో ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావడం లేదా నిబంధనల ప్రకారం తమ ప్రతినిధుల ద్వారా సంబంధిత ధ్రువపత్రాలను అందజేసి, వివరాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని వివరించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

