ఖైరతాబాద్, సెప్టెంబర్ 12: దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, బీసీలకు మాత్రం రాజ్యాధికారం దకడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చే శారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో బీసీ సం ఘాల ఆధ్వర్యంలో ‘56 శాతం బీసీలు… రాజకీయ న్యాయం ఎక్కడ’? అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎకడైనా మెజారిటీ వర్గాలు పాలకులుగా ఉంటే, ఇకడ మాత్రం మెజారిటీగా ఉన్న బీసీలు పాలితులుగా మిగిలిపోవడం విచారకరమని అన్నా రు.
తెలంగాణలో ఉన్న కీలక రాజకీయ, అధికార పదవుల్లో బీసీల సంఖ్య కనీసం 100 కూడా లేకపోవడం అన్యాయమని పేరొన్నా రు. రాజ్యాధికారం, డబ్బు ఉన్న వర్గాలే దేశా న్ని శాసిస్తున్నాయని, బీసీలు ఈ రెండింటికీ దూరంగా ఉండటం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆరోపించారు. బీసీలు తమ హకుల సాధన కోసం బలమైన శక్తిగా ఎదిగి పోరాడాలని సూచించారు. బీసీల సంక్షేమం, రాజ్యాధికారం కోసం సాగే ఏ పోరాటానికైనా తాను ముందుండి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో బహుజనుల హకులను కాలరాస్తూ, వారి ఎదుగుదలను అణచివేసేందుకు పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ కులగణన చేపట్టి లెకలు చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదని ప్రశ్నించారు. సెక్షన్ 22ఏ పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను పకదారి పట్టిస్తున్నారని, బహిరంగంగానే తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చిన్నచిన్న కేసుల్లో పేదలు, బహుజన నాయకులను ఇరికించి వేధిస్తున్న పరిపాలనా వ్యవస్థ, వేల కోట్ల భూ కుంభకోణాలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సర్వాయి పాపన్న, కుమ్రం భీం, దొడ్డి కొమురయ్య వంటి వీరులను కూడా గతంలో దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, నేటి రాజకీయాల్లోనూ ఎదుగుతున్న బహుజన నాయకులపై అబద్ధపు ఆరోపణలు మోపి ప్రజాదరణ తగ్గించే కుట్రలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రతి ఒకరూ సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకోవాలని, మేధావులు, యువకులు రోజుకు కనీసం గంట సమయం కేటాయించి, బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాలని పిలుపునిచ్చారు. బీసీ జనగణన, ఇతర బహుజన హకుల కోసం ఢిల్లీ స్థాయిలో జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, నాయకులు కటకం నర్సింగరావు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నీరజ, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ద్రోహుల పార్టీ బీజేపీ : జాజుల
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జనగణనలో ఓబీసీ కాలమ్‌ను ప్రత్యేకంగా చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి బీజేపీ మద్దతివ్వకపోవడం సిగ్గుచేటని, అది బీసీల ద్రోహుల పార్టీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాబో యే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు బైకాట్ చేస్తామని వెల్లడించారు. బీజేపీ తీరుకు నిరసనగా 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని, బీజేపీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.